భార్యాభర్తల సెక్స్ కోర్కెలకు డిప్రెషన్ (ఒత్తిడి) చాలా వరకు చెక్ పెడుతుంటాయి. ఈ ఒత్తిడి కారణంగా సెక్స్ కోర్కెలు అసలు లేకుండా పోయే అవకాశాలూ లేకపోలేదు. సెక్స్ కోర్కెలు తగ్గిన అనేకమంది స్త్రీ పురుషులను పరిశీలించగా చాలామందిలో ఈ విషయం తేలింది.ఇలాంటి వారిలో సెక్స్ కోర్కెలు తగ్గడానికి డిప్రెషనే ప్రధాన కారణంగా తాజాగా నిర్వహించిన ఒక సర్వేలోనూ వెల్లడైంది.నిజానికి డిప్రెషన్‌కు కారణాలేమైనా కావచ్చు. చివరికి వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యల వల్ల డిప్రెషన్ కలిగి, డిప్రెషన్ తిరిగి దాంపత్య సంబంధాల మీద ప్రభావం చూపొచ్చు. ఇది ఒక చక్రంలాంటిది. ఇదికాక డిప్రెషన్ తగ్గడానికి మందులు వాడుతున్నప్పుడు ఆ మందుల వల్ల కూడా సెక్స్ సమస్యలు ఏర్పడొచ్చు. ఈ మందులు సెక్స్ హార్మోన్లలో హెచ్చుతగ్గులు కలిగిస్తాయి.అందువల్ల ఇటువంటి సమస్యలు ఏర్పడతాయి.సెక్స్ కోర్కెలు ఉధృతంగా ఉండాల్సిన వయస్సులో ఆ కోర్కెలు కనపడని వారిలో కొందరిని ప్రత్యేక సర్వే కోసం వైద్యులు పరిశీలించారు. దీనిలో డిప్రెషన్ వల్ల కోర్కెలు తగ్గినవారే ఎక్కువ. దిగులుగా ఉన్నప్పుడు నెగటివ్ ఆలోచనలు కలుగుతాయి. సెక్స్ కోర్కెలు తగ్గిన వారిలో నిద్రలో అంగస్తంభనాలు తగ్గుముఖం పడతాయని సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఆల్కహాలిజమ్, దిగులు, టెన్షన్‌తో పాటు పిల్లలు కలగకపోవడం వంటి సమస్యలు కూడా డిప్రెషన్‌కు కారణమవుతాయి. ఇలాంటి సందర్భాలలో అంగస్తంభన కోసమో, సెక్స్ కోరికను పెంచేమరే ఇతర మందులు వాడినా ప్రయోజనం ఉండదని సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నా.urs Mani4u
No comments:
Post a Comment