సెక్సువల్ టెంపో తగ్గిపోతున్నట్లు అనిపిస్తోందా...? మనసులో సెక్స్ చేయాలన్న కోరిక బుసలు కొడుతున్నా... అక్కడికి వచ్చేసరికి చేయలేకవిఫలమవుతున్నారా..? అయితే అనుమానం లేదు. సూర్యరశ్మి లోపం ఉన్నట్లే... అర్థం కాలేదా...?సెక్స్ సమస్య ఎవరిలో ఎక్కువగా ఉంటుందీ అని పరిశీలిస్తే... నగర, పట్టణవాసులలోనే ఈ సమస్య అధికంగా ఉన్నట్లు తేలిందట. ఎందుకలా...? అనే ప్రశ్న మొలకెత్తడం సహజమే. కారణం... నగరాలు, పట్టణాలలో నివశించే ప్రజలు... ముఖ్యంగా పురుషులు తమతమ పనులతో మహా బిజీగా ఉంటారు. తెల్లారింది మొదలు రాత్రయ్యేవరకూ సూరీడు కిరణాలు తగలని ఆఫీసు కార్యాలయాల్లోనే కాలం గడుపుతారు. రోజుకు కనీసం ఓ గంటపాటైనా శరీరంపై సూర్యరశ్మి సోకని పురుషులలోసెక్స్ సామర్థ్యం "లో వోల్టోజి"కి మారిపోతున్నట్లు తేలింది.పూర్వకాలంలో సెక్స్ సత్తా లోపించిందని తెలిసినపుడు కామోద్రేకాన్ని కలిగించడానికి అప్పటికప్పుడు రెడీమేడ్‌గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనివిగా ఉండే మూలికలు లభ్యమయ్యేవని పూర్వులు చెప్పేవారు. అంతేకాదు దీనికంటూ ఓ వ్యక్తి ప్రతి గ్రామంలోనూ లేహ్యాలతో కాపురముండేవాడు. అయితే క్రమంగా అది కలుషితమైన వ్యాపారం కావడంతో... కనుమరుగైంది.ఇక కామసూత్ర, రతీమన్మథుల మధ్య కామోద్దీపనకై వారు ఎటువంటి మార్గాలను అన్వేషించారో తెలుసుకునే సమయమూ... తీరికా ఇప్పుడు లేదాయె. కనుక ఇప్పుడు ఏం చేయాలీ..? అనంటే... జస్ట్ రోజూ కనీసం గంటకు తగ్గకుండా సూర్యరశ్మికింద శరీరాన్నుంచాలి. అదేవిధంగా చాలినంత నిద్ర తప్పనిసరి. ఇంకా పరిశుద్ధమైన గాలి వీచే ప్రదేశాన్ని చూసుకుని అక్కడకనీసం ఓ అరగంటపాటు గడిపాలి. వ్యాయామం తప్పనసరి. ఇవన్నీ చేస్తే శరీరం కొత్త శక్తిని సంతరించుకుంటుంది.ఆదివారం శెలవురోజే కనుక ఆ రోజునాడు కనీసం మూడు నాలుగు గంటలు ఎండలో ఉండటానికి ప్రయత్నించండి. అలాగని మండే ఎండల్లో కాదు సుమా. గోరు వెచ్చని సూరీడు... చురుక్కుమనిపించేంత వరకూ.ఇవి ప్రకృతి ఇచ్చిన ప్రసాదాలు. వీటికి శృంగార సామర్థ్యాన్ని పెంచగల శక్తిఉంది. కనుక ప్రతిరోజూ "గో అండర్ సన్ లైట్... బ్రీత్ ఫ్రెష్ ఎయిర్ అండ్ గో టూ బెడ్ ఫర్ గుడ్ సెక్స్ లైఫ్" అంటున్నారు సెక్సాలజిస్టు. urs Mani4u
No comments:
Post a Comment