Tuesday, 4 August 2015

హస్త ప్రయోగం వల్ల అంగం ఆకృతి మారుతుందా?

అనేక మంది యువకులు పెళ్లికి ముందు హస్త ప్రయోగంతో సంతృప్తి చెందుతుంటారు. ఈ అలవాటు పెక్కు మందిలో చిన్న వయస్సు నుంచే ఉంటుంది. ఇలా హస్త ప్రయోగం చేసే యువకుల అంగం ఆకృతి (వంకర)లో మార్పు వచ్చినట్టుగా వారికి వారే భావించుకుంటారు. కొందరిలో నిజంగానే వంకర తిరిగి ఉంటుంది. పురుషాంగం ఇలా వంకరగా ఉండటం వల్ల సెక్స్ చేయలేనేమోననే భావన నెలకొంటుంది. వాస్తవానికి ఇది ఓ సమస్య కాదని సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.హస్త ప్రయోగం కారణంగా అంగం వంకరగా మారడం ఉండదంటున్నారు. అలాగే, హస్త ప్రయోగం వల్ల ఎటువంటి హాని జరగదని, కామోద్రేకాన్ని ఆణిచిపెట్టుకోలేని యువకులు వివాహేతర సంబంధాలు పెట్టుకుని సుఖవ్యాధుల బారిన పడే కంటే... హస్త ప్రయోగంతో సంతృప్తి చెందడంలో తప్పులేదని వారు అంటున్నారు.ఇకపోతే... కొంతందిలో అంగం వంగినట్టు ఉండడం సహజమేనని అంటున్నారు. ఐతే అంగస్తంభన జరిగాక నొప్పి పుడుతుందా అనేది గమనించాలన్నారు. చెత్తో సరిచేస్తున్నపుడు సరిగ్గా అవుతుందా లేదా అనేది కూడా గమనించాలన్నారు. చేత్తో సరిచేస్తున్నపుడు తిరిగి సరిగా అవుతున్నా, నొప్పి లేకపోయినా దీని గురించి ఆందోళన చెందనక్కర లేదంటున్నారు.ఎంత కోణంలో వంగి ఉన్నా అంగప్రవేశానికి అది అవరోధం కాదు. నిశ్చితంగా వుండవచ్చు.అలాకాక అంగస్తంభన సమయంలో అంగంలో నొప్పి అన్పిస్తే మాత్రం యూరాలజిస్టును సంప్రదించాలని సెక్స్ నిపుణులు చెపుతున్నారు. urs Mani4u

No comments:

Post a Comment